కాశిబుగ్గ: రాహుల్ గాంఽధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్ నుంచి కాశిబుగ్గ సెంటర్ వరకు సాగిన పాదయాత్రలో పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ. ఓటు హక్కు రక్షణ కోసం, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బాస్మియా, ఎస్యూసీఐ(సీ) నాయకుడు అడ్డుల సత్యనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు నవీద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ చైర్మన్లు చిలువేరు శ్రీనివాస్, రవీందర్ నాయక్, ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కరుణాటి పార్వతమ్మ, నాయకులు అబ్బిడి రాజిరెడ్డి, పిన్నింటి అనిల్రావు, అత్తి కుమారస్వామి, ఇస్లావత్ సావిత్రి, పోశాల వెంకన్న, దాడి శివ, రవికుమార్, ఈగ దామోదర్, జన్ను అరుణార్, మహ్మద్ జానీ పాల్గొన్నారు.


