రీసర్వేతో భూసమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీసర్వేతో భూసమస్యల పరిష్కారం

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

సంగెం: భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రీసర్వేను చేపట్టినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ లక్కినేని కిశోర్‌కుమార్‌ అన్నారు. వెంకటాపూర్‌లో భూముల రీసర్వేపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ సుమారు 125 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, తిరిగి ఇపుడు రీసర్వే చేపట్టినట్లు వివరించా. రీసర్వేలో భాగంగా జపాన్‌ టెక్నాలజీతో అధునాతనమైన రోవర్ల ద్వారా ఒక అంగుళం భూమి కూడా తేడా లేకుండా కొలతలు వేసి హద్దులు నిర్ణయిస్తారన్నారు. రైతులు తమ పట్టాపాస్‌ పుస్తకాల ఆధారంగా తమ వద్ద ఉన్న వివరాలను ఇవ్వాలని కోరారు. దాని ప్రకారం సర్వే చేపట్టి భూ రికార్డులను పరిశీలించి సర్వే వివరాలను నమోదు చేస్తారన్నారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. రీసర్వే పూర్తయిన అనంతరం ప్రతీ రైతు భూమికి సంబంధించిన మ్యాప్‌, భూదార్‌ నంబర్‌ను కేటాయిస్తారని వివరించారు. గ్రామంలోని 182 సర్వే నంబర్లలో 1065.26 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 17 సర్వే నంబర్లలో 237.30 ఎకరాలు ప్రభుత్వ భూమి, 827.36 ఎకరాల పట్టా భూమి ఉందని వివరించారు. సర్పంచ్‌ తాళ్లపల్లి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ న్యాల ఉమేష్‌, సర్వే అండ్‌ ల్యాండ్స్‌ ఏడీ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ లక్కినేని కిశోర్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement