యువకులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

యువకులు క్రీడల్లో రాణించాలి

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

వర్ధన్నపేట: యువకులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్‌ ఈగ మల్లేశం పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీ తండాలో సేవాలాల్‌ యూత్‌ అసోసియేషన్‌ బాధ్యులు బుధవారం ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేశవపురం, ఎన్‌ఎస్‌ తండా క్రీడాకారులకు టాస్‌ వేసి స్వయంగా బ్యాట్‌ పట్టి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. యువతలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, క్రీడా స్ఫూర్తితో భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసికోల్లాసం, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు కరిమిళ్ల సంపత్‌రావు, జన్ను రాములు, ప్రభాకర్‌, రాము నాయక్‌, సంతోష్‌నాయక్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల

మాజీ డైరెక్టర్‌ ఈగ మల్లేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement