కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం

హన్మకొండ చౌరస్తా: రాహుల్‌ గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో అశోకా జంక్షన్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు డీసీసీ భవన్‌ నుంచి జంక్షన్‌ వరకు ప్లకార్డులు, దిష్టిబొమ్మతో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి, వీసం సురేందర్‌రెడ్డి, అలువాల కార్తీక్‌, భీమా వినయ్‌ మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భగ్గుమన్న అఖిలపక్ష నాయకులు

కాశిబుగ్గ: రాహుల్‌ గాంఽధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌ నుంచి కాశిబుగ్గ సెంటర్‌ వరకు సాగిన పాదయాత్రలో పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కాశిబు గ్గలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బస్మియా, ఎస్‌యూసీఐ(సీ) అడ్డుల సత్యనారాయణ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు నవీద్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొరివి పరమేశ్‌, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌ చైర్మన్లు చిలువేరు శ్రీనివాస్‌, రవీందర్‌ నాయక్‌, ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కరుణాటి పార్వతమ్మ, నాయకులు అబ్బిడి రాజిరెడ్డి, పిన్నింటి అనిల్‌రావు,అత్తి కుమారస్వామి, ఇస్లావత్‌ సావిత్రి, పోశాల వెంకన్న, దాడి శివ, రవికుమార్‌, ఈగ దామోదర్‌, జన్ను అరుణార్‌, మహ్మద్‌ జానీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement