నర్సంపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలు ఆరుతడి పంట రైతులకు కొండంత ఊరటనిచ్చాయి. వానాకాలంలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు శ్రమకు తగ్గట్టు దిగుబడి రావడంతో రైతుల ముఖాల్లో చిరనవ్వులు వికసిస్తున్నాయి. పైగా మార్కెట్‌లో సైతం వ్యాపారులు మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తుండటంతో ఈసారి మక్క రైతులకు కలిసి వస్తుందని ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మండలా ల్లో మొక్కజొన్న పంట 18,208 ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ సీజన్‌లో సాగైంది. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గలో సుమారు 11,900 ఎకరాల విస్తీర్ణంలో సాగు అయినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు.
మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు
వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు భారీగా అడుగంటి పోయాయి. వరి పంటతో పాటు ఇతర పంటలకు తడినీరు అందుతుందో? లేదో అన్న రైతులకు మొక్కజొన్న పంట ఈసారి ఆదుకుంటుంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,410 మద్దతు ధర కంటే వ్యాపారులు రూ. 2,500 వెచ్చించి కొనుగో లు చేయడం కొంత ఉపశయనం కలిగిస్తుంది.
గత రబీలో ఇబ్బందులు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా రబీ సీజన్‌లో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. రికార్డుల ప్రకారం అత్యధికంగా మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు అకాల వర్షాలతో పాటు మద్దతు ధర కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట ఎక్కువగా సాగు కావడం, దిగుబడులు కూడా అదే స్థాయిలో రావడంతో మార్కెట్లతో పాటు రోడ్లపై ఎక్కడ చూసిన మక్క రాశులే కనించాయి. మార్క్‌ఫెడ్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ లారీల కొరతతో పాటు గోదాంలో స్థలం లేకపోవడంతో మక్కరాశులు పేరుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు కూడా దిగారు. ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
దిగుబడిపై రైతుల సంతృప్తి..
ఈసారి ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసి కాపాడుకుంటూ వచ్చారు. దేవుడు కరుణించి పంట చేతికి వస్తుండడంతో పాటు ఆశించిన స్థాయిలో ది గుబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఒక ఎకరం సాగు చేసిన రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత పది రోజుల నుంచి నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మక్కలను విక్రయించడానికి భారీగా తీసుకువస్తున్నారు.
మూడు ఎకరాల్లో సాగు చేశా
మాకు ఉన్న ఐదు ఎకరాల్లో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. భారీ వర్షాలు లేనప్పటికీ అప్పుడప్పుడు కురిసిన వర్షాలు మొక్కజొన్న పంటకు తడి నీరు అందింది. 150 బస్తాలను సోమవారం నర్సంపేట మార్కెట్‌లో విక్రయించాను. క్వింటాకు రూ.2,517ధర లభించింది. గత సంవత్సరం రూ.1,800లకే క్వింటా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ఈసారి మొక్కజొన్న పంట ఆదుకుంది.
–మారపాక రాజు, మాధన్నపేట
గతంలో కంటే మేలు
గతేడాది మార్కెట్‌లో ఎవరూ కొనలేదు. క్వింటాకు రూ.1,800 కూడా ధర లభించలేదు. ఈసారి వర్షాలు తక్కువ పడినా.. పంట బాగానే వచ్చింది. వ్యాపారులే స్వయంగా మంచి ధరకు కొంటున్నారు. ప్రభుత్వం ఇదేవిధంగా కాంటాలు త్వరగా పెడితే రైతులకు మేలు జరుగుతుంది.
– బోడ మంగునాయక్, ఏనుగల్ తండా
జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు (ఎకరాల్లో)
2,918
మొత్తం సాగు విస్తీర్ణం: 18,208
1,652
1,336
1,047
928
849
796
729
264
వర్ధన్నపేట
సంగెం
నల్లబెల్లి
పర్వతగిరి
దుగ్గొండి
గీసుకొండ
నర్సంపేట
వరంగల్
ఖిలా వరంగల్
ఖానాపురం
రాయపర్తి
చెన్నారావుపేట
నెక్కొండ
మొక్కజొన్న సాగుకు అనుకూలంగా వాతావరణం
ఆశించిన మేర దిగుబడి వచ్చే అవకాశం
మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
నర్సంపేట మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు
2,688
1,953
1,898
1,150


