వినతులు కొన్ని ఇలా..
●ఉండటానికి ఇల్లు లేదు. దివ్యాంగుల కోటా కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవా లని సంగెంకు చెందిన వహదాబీ వినతి పత్రం అందించారు.
●ఖిలా వరంగల్ మండలం మామునూరు గ్రామ సరిహద్దులోని 0.34 గుంటల వ్యవసాయ భూమికి అక్రమ మ్యుటేషన్‌పై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తిమ్మాపూర్‌కు చెందిన గంగిడి వీరారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. మొత్తం 248 మంది తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు దరఖాస్తులు అందించారు. సమస్యలు విన్న కలెక్టర్ సత్యశారద.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా రెవెన్యూ శాఖ 90, జీడబ్ల్యూఎంసీ 61, హౌసింగ్ 13, డీఆర్‌డీఓ 24, ఇతర శాఖలకు సంబంధించినవి 48 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులక ఎండార్స్ చేశారు. అలాగే వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్‌కుమార్, వై.వి.గణేష్, జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్‌ఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్, హౌసింగ్ పీడీ విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వీకరించిన కలెక్టర్ సత్యశారద
త్వరగా పరిష్కరించాలని ఆదేశం


