అంగన్‌వాడీ సేవలపై మహారాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ సేవలపై మహారాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

కాళోజీ సెంటర్‌: రాష్ట్రంలో అమలవుతున్న అంగన్‌వాడీ సేవలు, ఐసీడీఎస్‌, పోషకాహార కార్యక్రమాలు, కేంద్ర వంటశాల విధానాన్ని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారుల బృందం సోమవారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. మహారాష్ట్ర డబ్ల్యూసీడీ అదనపు కమిషనర్‌ విజయ్‌ క్షీర్సాగర్‌ ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది. మొదట ఎనుమాముల మార్కెట్‌లోని అక్షయపాత్ర కేంద్ర వంటశాలను సందర్శించిన అధికారులు ఆహార పదార్థాల నిల్వ, తయారీ, నాణ్యత, ప్యాకింగ్‌, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా విధానాన్ని పరిశీలించారు. సుందరయ్యనగర్‌, గుడెప్పాడ్‌ అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్‌ విద్య, ఎదుగుదల పర్యవేక్షణ, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, లబ్ధిదారులతో మాట్లాడి సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లైజనింగ్‌ అధికారి శివాల్కర్‌రెడ్డి, హనుమకొండ డీడబ్ల్యూఓ విశ్వజ, వరంగల్‌ సీడీపీఓ విద్య, పరకాల సీడీపీఓ స్వాతి, ఏసీడీపీఓ సింధు, సూపర్‌వైజర్లు లావణ్య, ఉమాదేవి, మంజుల, జిల్లా కోఆర్డినేటర్‌ కార్తీక్‌, సుమలత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement