నర్సంపేట: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్రెడ్డి సర్వోత్తమ్రెడ్డి విజయానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షుడు పంబి వంశీ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, రూపిక శ్రావణ్, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


