కాజీపేట: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడౌజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్’ యాప్ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్ కోడ్తో కూడిన డిజిటల్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ టి.సత్యనారయణ, సీఐలు పిట్టల వెంకన్న, జక్కుల శ్యాంసుందర్, ఎస్సైలు మంగ, శ్రావణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


