పరకాల: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఫేజ్–2లో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈసందర్భంగా సోమవారం పరకాల ఆర్డీఓ డీఎస్ వెంకన్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన తహసీల్దార్లను, ఎంపీడీఓలను, బీఎల్ఓ సూపర్వైజర్లను, బీఎల్ఓతో పాటు ఇతర ఎన్నికల సిబ్బందిని, బూత్లెవల్ ఏజెంట్లను కూడా ఎన్నికల ముఖ్య అధికారి అభినందించినట్లు తెలిపారు.
అభినందనలు తెలిపిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి


