భీమదేవరపల్లి: దేశానికే ఆదర్శంగా నిలిచిన ముల్క నూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకమని గ్రూప్ –1, 2, 3 ట్రైనీ అధికారులు కొనియాడారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శిక్షణ పొందుతున్న 290 మంది అధికారులు రెండు రోజుల పాటు రెండు విడతల్లో ముల్కనూరు సహకార సంఘాన్ని సందర్శించి అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 3న మొదటి విడతలో 145 మంది, 4న రెండో విడతలో మరో 145 మంది సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సొసైటీ ఆవిర్భావం, రైతులకు అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత సేవలతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాలను సంఘం సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో సొసైటీ జనరల్ మేనేజర్ ఎం.రాంరెడ్డితో పాటు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
సంఘాన్ని సందర్శించిన గ్రూప్ –1, 2, 3 ట్రైనీ అధికారులు


