● సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ అర్పిత
చెన్నారావుపేట : సైబర్ నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునే దిశగా ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత వివరాల గోప్యత పాటించాలని హైదరాబాద్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ అర్పిత కోరారు. మండలంలోని అమీనాబాద్ పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో సైబర్ సెక్యూరిటీపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఎక్కువగా మోసాలకు గురై నష్టపోతున్నారని తెలిపారు. పీడీఎఫ్‌లు, అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దని చెప్పారు. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతోపాటు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. సదస్సులో ప్రిన్సిపాల్ చిట్ట జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


