నర్సంపేట రూరల్ : మండలంలోని భాంజీపేట గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తుడు జిల్లా కలెక్టర్‌కు, డీపీఓకు చేసిన ఫిర్యాదుపై డీఎల్‌పీఓ రాజీవ్ శనివారం విచారణ చేపట్టారు. ఆయన ఆ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలపై ఫిర్యాదుదారు భూషబోయిన ప్రవీణ్ నుంచి లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు. అనంతరం డీఎల్‌పీఓ మాట్లాడారు. మరో మూడ్రోజుల్లో వివరాలు పరిశీలించి డీపీఓకు నివేదిక ఇస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొయ్యల రాజు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


