● మెపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్
దుగ్గొండి : ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా ఎదగాలని ముదిరాజ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ కోరారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శానబోయిన రాజ్‌కుమార్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న నేపథ్యంలో ఆయన్ను గిర్నిబావిలో దేవేందర్, నాయకులు శనివారం శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడారు. ముదిరాజ్ కులస్తులు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కులస్తుల ఉన్నతికి సంఘం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జెటబోయిన రాజు, మహేందర్, కూస రాజేందర్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.


