నర్సంపేట : అధికారులు ఆర్‌ఎంపీలపై దాడులు చేయడం సరికాదని అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ గ్రామీణ వైద్యుల స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. నర్సంపేటలో శనివారం ఆయన మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ వైద్యాన్ని గ్రామీణులకు అందుబాటులో లేకుండా చేసి కార్పొరేట్
సంస్థలకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం జీరో పాయింట్లతో అట్టడుగున ఉందన్నారు. గ్రామాల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్రంలో 45వేల మంది ఆర్‌ఎంపీలు లక్షలాది మందికి ప్రథమ చికిత్స చేస్తుండగా అక్కడక్కడా పొరపాట్లు సహజమన్నారు.


