బీజేవైఎంలో చోటు | - | Sakshi
Sakshi News home page

బీజేవైఎంలో చోటు

Oct 4 2026 11:01 AM | Updated on Oct 4 2026 11:01 AM

రాయపర్తి: మండలానికి చెంది న పెండ్యాల గణేష్‌ బీజేవైఎం జనగామ జిల్లా

ప్రధాన కార్య దర్శిగా, మంచాల సుమన్‌ యాదవ్‌ ఆ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గణేష్‌, సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఉంటూ తాము చేస్తున్న సేవలకు గుర్తింపుగా తమను ఎన్నుకున్నట్టు తెలిపారు. నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటుకు నోటీసులు

వర్ధన్నపేట : పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆయా ఆలయ గోడలకు శనివారం నోటీసులు అంటించింది. ఒక్కో ఆలయానికి ఐదుగురు సభ్యులతో ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బోర్డులో ఒక మహిళకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు 20 రోజుల్లోగా నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయశాఖ వెల్లడించారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నట్టు వివరించారు.

వైద్యశిబిరం

ఖానాపురం : మండలంలోని బుధరావుపేట మోడల్‌ స్కూల్‌లో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. శుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. ఆహారంలో ఆకు కూరలతోపాటు పప్పు, కోడిగుడ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సమతుల ఆహారం తీసుకుంటే అనారోగ్యానికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ వేణుగోపాల్‌, ఏఎన్‌ఎంలు జ్యోతి, భార్గవి, హెల్త్‌ అసిస్టెంట్‌ గొడిశాల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీటీ రోడ్డు పరిశీలన

నర్సంపేట : నర్సంపేటలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఎదుట ఉన్న బీటీ రోడ్డును ప్రముఖ కాంట్రాక్టర్‌ అజయ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షలతో టెండర్‌ వేసినట్టు తెలిపారు. దీపావళి లోపు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీసీ రోడ్డుతోపాటు ఇరువైపులా డ్రెయినేజీ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ దేవోజు తిరుమల సదానందం పాల్గొన్నారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

పర్వతగిరి : మండలంలోని అర్హులైన పట్టభద్రులు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటస్వామి కోరారు. ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాయాల్లో ఫారం–18 అందుబాటులో ఉంచిందని చెప్పారు. అర్హులు ఫారం–18 పూరించి సంబంధిత పత్రాలు జత చేసి కార్యాలయంలో నవంబర్‌ 6వ తేదీ వరకు అందజేయాలని సూచించారు.

నివాళి

నర్సంపేట రూరల్‌ : మండలంలోని ముగ్దుంపురంలోని శ్రీ రామ ధాన్య విత్తన సంఘం ఆవరణలోని అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు విగ్రహానికి ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి, రాజపల్లి మాజీ సర్పంచ్‌ నామాల సత్యనారాయణ శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ గ్రామంలో వెంకటేశ్వర్‌రావు 17వ వర్ధంతి నిర్వహించగా జయపాల్‌రెడ్డి అతిథిగా హాజరై ప్రసంగించారు. వెంకటేశ్వరరావు సహాకార రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. కార్యమ్రకంలో సంఘం పాలకవర్గ సభ్యులు సిద్ద సుధాకర్‌, చల్లా మల్లారెడ్డి, అర్శనపల్లి ప్రభాకర్‌రావు, నాంపెల్లి సాంబయ్య, గోపు రత్నాకర్‌రెడ్డి, సంఘం ఉద్యోగులు నామాల సురేష్‌, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంఘం ప్రతినిధులు వెల్దండి పద్మ, పైడిపెల్లి పద్మ, నాంపెల్లి రజిత, సింగం భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

గీసుకొండ : మండల కేంద్రానికి చెందిన కోట సమ్మయ్య మృతి చెందగా బాధిత కుటుంబానికి స్టేట్‌ బ్యాంక్‌ రిటైర్డ్‌ మేనేజర్‌ లక్ష్మీనారాయణ రూ.5 వేల నగదు అందజేశారు. ఆయన అందించిన నగదును బాధిత కుటుంబానికి ఉపసర్పంచ్‌ కోట ప్రమోద్‌ అందజేశారు. మృతదేహానికి సమ్మయ్య, సామాజిక సేవకుడు రామ్మూర్తి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement