కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముగ్గురు ఉపాధ్యాయులు హాజరు కాగా.. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని శనిగరపు శ్రీఆధ్య మాత్రమే పాఠశాలకు హాజరైంది. ఈ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా.. నలుగురు ఉపాధ్యాయులకుగాను వేసవి సెలవులకు ముందు హెచ్‌ఎం ఉద్యోగ విరమణ పొందారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
– మరిన్ని ఫొటోలు 8లో..


