అటవీ సంరక్షణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణకు ప్రాధాన్యం

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

న్యూశాయంపేట: జిల్లాలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి బి.నిఖిత అన్నారు. ఇటీవల జిల్లా అటవీశాఖాధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారుల (ఎఫ్‌ఆర్‌ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వీలుగా రాబోయే కాలంలో ప్లాంటేషన్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. సమావేశంలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు రవికిరణ్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు.

యూరియా వినియోగాన్ని తగ్గించాలి

నెక్కొండ: యూరియా వినియోగాన్ని తగ్గించాలని మట్టి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్‌ సీహెచ్‌.రాములు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అధిక యూరియాను వినియోగించడంతో నేలలోని సహజ పోషకాలు దెబ్బతిని పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఏఎంసీ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డి, ఏఓ నాగరాజు, మార్కెట్‌ కార్యదర్శి కృష్ణమీనన్‌రావు, డీసీసీ బ్యాంక్‌ మేనేజర్‌ వినీత, సర్పంచ్‌ పెండ్యాల హరిస్రసాద్‌, ఏఈఓలు రాజీవ్‌, అఖిల్‌, కావ్య, కావేరి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు ఉచిత శిక్షణ

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అర్హులైన ఆస్తకిగల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కులు, జైన్‌, బౌద్ద, పార్సీ) ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

భద్రత నియమాలు పాటించాలి

నర్సంపేట రూరల్‌: విద్యుత్‌ పరికరాలు విని యోగించే సమయంలో భద్రత నియమాలు పాటించాలని జిల్లా డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) మఽ దుసూదన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని జయముఖి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యుత్‌ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ (ప్రాజెక్టు) మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ ఆనందం, డివిజన్‌ ఇంజనీర్‌ రాంబాబు, తిరుపతి, విద్యుత్‌ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement