హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేయాలి

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

నల్లబెల్లి: పకడ్బందీగా హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న అన్నారు. ఎంపీడీఓ కార్యాలయలో బుధవారం సెన్సెస్‌–2027 ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెన్సెస్‌–2027లో భాగంగా హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల క్రియేషన్‌, క్రమబద్ధీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, బీఎల్‌లకు దిశానిద్దేశం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. తహసీల్దార్‌ ముప్పు కృష్ణ, ఎంపీఓ పసరగొండ రవి, ఏఎస్‌ఓ అనిల్‌, ఆర్‌ఐలు సంపత్‌, చామంతి పాల్గొన్నారు.

జనాభా లెక్కల సర్వే పూర్తిచేయాలి

రాయపర్తి: అన్ని శాఖల సమన్వయంతో గ్రామాల్లో జనాభా లెక్కల సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ కిషన్‌నాయక్‌, ఎంఈఓ శ్రీనివాస్‌, ఎంపీఎస్‌ఓ కల్యాణ్‌, సర్వేయర్‌ వీరస్వామి, ఆర్‌ఐలు చంద్రమోహన్‌, సంధ్యారాణితో జనాభా లెక్కల సర్వే–2027పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement