● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి
గీసుకొండ: విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమించాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి అన్నారు. కోటగండి సమీపంలోని పీడీఆర్ గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన ఎన్పీడీసీఎల్ డివిజన్‌స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, వైర్ల బిగింపు తదితర పనులు కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టాలన్నారు. డీటీఆర్ వైఫల్యాలను అధిగమించాలన్నారు. 11 కేవీ ఫీడర్ల విషయంలో అంతరాయాలు, బ్రేక్‌డౌన్లు లేకుండా జాగ్రత్త వహించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. వరంగల్ రూరల్ ఓపీ డీఈ బి.దానయ్య, వరంగల్ ఎం అండ్ సీ డీఈ జాటోత్ హర్జీనాయక్, క్వాలిటీ కంట్రోల్ డీఈలు శ్రీధర్, రాందాస్‌నాయక్, వరంగల్ టౌన్ ఓపీ డీఈ ఎస్.మల్లికార్జున్, సంగెం, గీసుకొండ ఓపీ ఏడీఈ బానోతు రవినాయక్, ఏడీఈలు మహేందర్, రవికుమార్, తిరుపతి, తిరుపతి, ఈఆర్‌ఓ ఏఏఓ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఎంపీ కావ్యకు టీజీఓ నేతల అభినందనలు
హన్మకొండ అర్బన్: వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ కడియం కావ్యకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో టీజీఓ బృందం ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోలా రాజేశ్‌గౌడ్, అస్నాల శ్రీనివాస్, టీజీఓ నేతలు సంతోశ్, మల్లయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, రమేశ్, భీంరావు, తదితరులు పాల్గొన్నారు.


