మండలం సంఘాలు రుణ లక్ష్యం తీసుకున్న రుణాల పంపిణీ శాతం
సంఘాలు
గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల)కు రుణాల పంపిణీలో జిల్లా మెరుగైన స్థానం సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 8,226 సంఘాలకు రూ.502,83,46,000 బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 7,242 సంఘాలకు రూ.503,14,10,000 ఇచ్చారు. వంద శాతానికి పైగా రుణాలు పంపిణీ చేసిన జిల్లాగా గుర్తింపును సాధించింది. ఎక్కువ ఎస్‌హెచ్‌జీలకు రుణాల పంపిణీలో జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. రాష్ట్రంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానం(124.58 శాతం), పెద్దపల్లి జిల్లా రెండో స్థానం (94.23 శాతం), వరంగల్ జిల్లా (88.04 శాతం) తృతీయ స్థానంలో నిలిచింది.
లక్షాధికారులను
చేయాలన్నదే లక్ష్యం
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలనే లక్ష్యంతో లింకేజీ రుణాలను అధికంగా ఇస్తున్నారు. సంఘాల్లోని మహిళలకు ఎవరికి ఎంత అవసరమో ముందే గుర్తించి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు, మండల సమాఖ్య ప్రతినిధులు, సీసీలు వీఓల వారీగా రుణ ప్రణాళిక తయారు చేస్తారు. సంఘాల మహిళలకు వారి అవసరాలు, సామర్థ్యాల ఆధారంగా కుట్టుమిషన్లు, పిండిగిర్ని, కిరాణం, బట్టల షాపు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, పెట్టుబడి సాయం, శానిటరీ న్యాప్కిన్ల తయారీ లాంటి వాటికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నారు. దీంతో వారి జీవనోపాధి మెరుగుపడుతోంది. అలాగే సోలార్‌ప్లాంట్ల ఏర్పాటు, పాల ఉత్పత్తుల కేంద్రాలు తదితర వాటి నిర్వహణ కోసం రుణాలు అందిస్తున్నారు.
ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు
7,242 సంఘాలకు రూ.503,14,10,000
పంపిణీలో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానం
జిల్లాలో గీసుకొండ టాప్..
బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లాలో గీసుకొండ మండలం ఈసారి కూడా టాప్‌లో నిలిచింది. ఎక్కువ సంఘాలకు (202.91 శాతం) రుణాలను అందించడం, రుణ పంపిణీలో (118.81 శాతం) ఇతర మండలాలతో పోలిస్తే ముందు నిలిచింది. 2023 నుంచి 2026 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ వరుసగా మండలం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ద్వితీయ స్థానంలో చెన్నారావుపేట, తృతీయ స్థానంలో సంగెం మండలాలు ఉన్నాయి.
మండలాల వారీగా ఎస్‌హెచ్‌జీలు, పంపిణీ చేసిన రుణాలు(రూ.లలో)
గీసుకొండ 413 33,99,98,000 838 40,39,57,000 118.81
చెన్నారావుపేట 642 42,00,30,000 820 46,32,68,000 110.29
సంగెం 847 55,98,93,000 806 62,00,15,000 110.74
వర్ధన్నపేట 664 40,70,20,000 617 43,60,50,000 107.13
ఖానాపురం 677 41,84,41,000 605 41,87,31,000 100.07
నర్సంపేట 478 31,02,51,000 405 32,77,11,000 105.63
పర్వతగిరి 814 49,83,89,000 664 49,21,51,000 98.75
రాయపర్తి 1005 61,36,53,000 780 57,97,62,000 94.48
నెక్కొండ 1001 62,99,11,000 736 59,24,04,000 94.05
నల్లబెల్లి 692 86,63,000 409 31,17,35,000 76,28
దుగ్గొండి 993 2,20,97,000 559 38,56,26,000 91.36
8,226 502,83,46,000 7,242 503,14,10,000 100.06


