న్యూస్‌రీల్
వరంగల్
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
కోర్టుకు బాంబు బెదిరింపు
ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో 25 చిన్న ౖసైనెడ్ గ్యాస్ బాంబులను సోమవారం పేల్చనున్నట్లు కోర్టుకు మెయిల్ చేశారు.
వాహన్
పోర్టల్
ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలి
గీసుకొండ: ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాను ముందు వరుసలో నిలపడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత అనే అంశంపై సంబంధిత సిబ్బందికి వరంగల్ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు మొదటి మూడు నెలలలోపు ఎయిడ్స్ సిఫిలిస్, హెచ్‌బీఎస్ ఏజీ వందశాతం జరిగేలా చూడాలన్నారు. ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, నాకో ప్రతినిధి సెల్వం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీటీఎస్ సిబ్బంది, ఎన్‌జీఓలు పాల్గొన్నారు.
ఇంగ్లిష్ పరీక్షకు 99.91శాతం హాజరు
కాళోజీ సెంటర్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో భాగంగా సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 99.91 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 9,383 విద్యార్థులకు 9,375 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రైవేట్ అభ్యర్థులు మొత్తం 19 మంది కాగా, 18 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు.
హనుమకొండలో 99శాతం..
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన టెన్త్ ఇంగ్లిష్ పరీక్షకు 99.86శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 64 కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 12,047మంది విద్యార్థులకుగాను 12030మంది హాజరయ్యారని, 17మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎల్‌వి గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. డీఈఓ ఆరు కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరి నాలుగు కేంద్రాలను, నాలుగు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ల బృందాలు 25 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
26న మెగా జాబ్‌మేళా
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను జిల్లాలోని డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ సూచించారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో జాబ్‌మేళా కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని వివరాలకు 98491 51377, 99480 48349, 94931 27804 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ కంపెనీ హెచ్‌ఆర్‌లు సుధీర్, సందీప్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎంఎంకే రహీమొద్దీన్, అధ్యాపకులు డాక్టర్ సోమయ్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్ భద్రు, డాక్టర్ రాజీరు, దివ్య తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’
● మొదటి విడతలో ఎకరానికే..
● రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ
ఖిలా వరంగల్: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో వేసింది. తొలి విడతలో ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నగదు జమ చేసింది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కేవలం ఒక ఎకరానికే రూ.6 వేల చొప్పున జమ చేసింది. దీంతో ఒకటి కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు విడతల వారీగా రైతు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ వేయనుంది. జిల్లాలో యాసంగి పంటకు 1,55,169 మంది రైతులకుగాను 1,26,590 ఎకరాలకు ఎకరానికి రూ.6 వేలు చొప్పున పెట్టుబడి సాయం కింద మొత్తం రూ.75,95,40,280 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. రానున్న రోజుల్లో 1,45,510 ఎకరాలకు రూ.8,73,060 కోట్లు జమ చేయాల్సి ఉంది.
స్వచ్ఛ ఆటోలకు మైకులు తప్పనిసరి
వరంగల్ అర్బన్: స్వచ్ఛ ఆటోలకు మైకులు తప్పనిసరిగా అమర్చేలా చూడాలని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 24వ డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించిన మేయర్, శానిటేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. శుభ్రత కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచనాలు చేశారు. ఈసందర్భంగా చెత్త సేకరణకు వచ్చే స్వచ్ఛ ఆటోలు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు సమాచారం అందడం లేదని స్థానికులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు.


