అన్ని షోరూంల్లో లాంఛనంగా అమల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

అన్ని షోరూంల్లో లాంఛనంగా అమల్లోకి..

Mar 24 2026 6:47 AM | Updated on Mar 24 2026 6:47 AM

ఖిలా వరంగల్‌ : వాహన వివరాలు ఇకనుంచి వాహన్‌ పోర్టల్‌లో కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వాహనాలు, లైసెన్సులు తదితర సేవలను వాహన్‌ పోర్టల్‌లో అందిస్తుండగా.. హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా వాహన్‌ పోర్టల్‌ సేవలను సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ డీటీసీ సురేశ్‌రెడ్డి పర్యవేక్షణలో వాహన షోరూంలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. గతంలోనే వాహన్‌ పోర్టల్‌పై షోరూంల యజమానులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయితే వాహనదారులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి.

సేవలు అందేదిలా..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి న వాహన్‌ పోర్టల్‌ ద్వారా అందనున్నాయి. ప్రధానంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలు, ఎన్‌ఓసీలు, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, బీమా, ఇంజిన్‌ ఛాసిస్‌ నంబర్‌ వంటి సమాచారం ఈ పోర్టల్‌ ద్వారా అందుతాయి. పూర్తి పారదర్శకంగా సేవలు నమోదవుతాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాహన వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కూర్చున్న చోట నుంచే తేలికగా ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. వాహన పోర్టల్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతీ షోరూం సోమవారం అనుసంధానమైంది. తద్వారా ఏ రోజు విక్రయించిన వాహనాలు ఆ రోజే పోర్టల్‌లో నమోదవుతాయి. అలాగే, వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకులను అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియతో బోగస్‌ ఫైనాన్స్‌ సంస్థల ఆటకు అడ్డుకట్ట వేసినట్లయింది.

వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయం

జిల్లాల వారీగా వ్యక్తిగత వాహనాల వివరాలు

జిల్లాలు ద్విచక్ర కార్లు / షోరూంలు

వాహనాలు జీపులు

వరంగల్‌ 1,85,865 24,791 23

హనుమకొండ 2,16,234 48,513 26

జనగామ 61,036 8,537 12

జేఎస్‌ భూపాలపల్లి 95,681 11,258 7

ములుగు 4,433 3,767 2

మహబూబాబాద్‌ 1,23,103 9,096 17

షోరూంల్లో పారదర్శకంగా సేవలు

కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలన్నీ సోమవారం మధ్యాహ్నం వాహన షోరూంల్లో వాహన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేశారు. వాహన్‌ పోర్టల్‌ పూర్తిస్థాయిలో అమలుల్లోకి వచ్చింది. కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించింది.

వాహన్‌ పోర్టల్‌ సేవలు పక్కాగా అమలు

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్‌ పోర్టల్‌ సేవలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా వాహన షోరూంల్లో వాహన్‌ పోర్టల్‌ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇక నుంచి షోరూంల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలందుతాయి. ఎలాంటి జాప్యం ఉండదు. – సురేశ్‌రెడ్డి, డీటీసీ, వరంగల్‌

ఆర్టీఏ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే.. దేశవ్యాప్తంగా ఒకే విధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement