కలెక్టరేట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

Mar 24 2026 6:47 AM | Updated on Mar 24 2026 6:47 AM

భవన సముదాయాన్ని సందర్శించిన కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. వరంగల్‌ పాత ఆజంజాహి మిల్‌ మైదానంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కలెక్టర్‌ సోమవారం సందర్శించారు. సముదాయంలోని మూడు అంతస్తుల నిర్మాణ పనులు పూర్తై న నేపథ్యంలో వివిధ శాఖలకు గదుల కేటాయింపునకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి రాజేందర్‌, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) మ్యాపింగ్‌ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో వరంగల్‌ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవ వర్గాలకు సంబంధించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ రంజిత్‌, రాజకీయ పార్టీల నాయకులు ఫైజుద్దీన్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత

న్యూశాయంపేట: అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద గుర్తుచేశారు. నేటి విద్యార్థుల్లో పెరుగుతున్న పర్యావరణ చైతన్యం భవిష్యత్‌కు ఆశాజనకమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకత చిత్రాలను కలెక్టరేట్‌లో ప్రదర్శించారు. ముఖ్యంగా కరీమాబాద్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిత్రలేఖనంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నోట్‌బుక్స్‌, పెన్నులు, ప్రశంస పత్రాలను కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement