మాది ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ గ్రామం. మేము 40 మంది కుటుంబ సభ్యులం. నాకు ఇప్పుడు 75 ఏళ్లు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ఇప్పటి వరకు ఆ భూమిపై హక్కు పత్రాలు లేవు. మా తాత ముత్తాతల నుంచి ధ్రువీకరణ పత్రాలను అన్ని శాఖలకు అందించాం. న్యాయం చేయాలని హైకోర్టు చుట్టూ తిరిగాం. జడ్జిమెంట్ కాపీలను కూడా అధికారులకు అందించాం. మా సమస్యను పరిష్కరించాలని గత సంవత్సరం ఆగస్టులో కలెక్టర్ ఆదేశించినా సంబంధిత అధికారులు పెడచెవిన పెట్టారు.
– మహ్మద్ సమద్, కుటుంబ సభ్యులు, అశోక్‌నగర్


