న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి కలెక్టర్ సత్యశారద అర్జీలు స్వీకరించారు. అనంతరం, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొన్ని సమస్యలను దరఖాస్తు దారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో చర్చించి కలెక్టర్ సత్యశారద పరిష్కరించారు. పరిష్కారం కాని సమస్యలుంటే అందుకు గల కారణాలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రజావాణికి మొత్తం 127 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 50, జీడబ్ల్యూఎంసీ 16, ఇతర శాఖలకు సంబంధించినవి 61 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌లో వైద్యశిబిరం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ఆలస్యం కావడంతో దరఖాస్తుదారులకు అరటి పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యశారద
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం


