యూరియా కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం బారులు

Jan 6 2026 7:06 AM | Updated on Jan 6 2026 7:06 AM

యూరియ

యూరియా కోసం బారులు

ఖానాపురం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేవు. వ్యవసాయ అధికారులు కేవలం మొక్కజొన్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు మండలంలోని అశోక్‌నగర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం యూరియా బస్తాల కోసం రైతులుబారులు తీరారు. కాగా పలువురు రైతులు టోకెన్లు తీసుకొని బస్తాలు తీసుకోగా మరికొందరు వెను తిరిగారు. పలు సొసైటీ గోదాంలోని యూరియా నిల్వలను ఎంపీడీఓ అధ్వైత పరిశీలించి సూచనలు చేశారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

నర్సంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం అకడమిక్‌ మార్కులే కాకుండా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు, స్టాఫ్‌ స్కిల్స్‌ కలిగి ఉండడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్‌ మల్లం నవీన్‌ అన్నారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్టాఫ్‌ స్కిల్స్‌ సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈ కోర్సుతో ఇతరులతో విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌ అవుతాయన్నారు. హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగాధిపతి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దినకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్‌ ఎం.సోమయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సత్యనారాయణ, సత్యనారాయణ, కమలాకర్‌, భద్రు, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్న కేంద్రం

నర్సంపేట: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతుందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్‌ అన్నారు. ఈ మేరకు సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సోమవారం ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి ముగింపు వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన పార్టీ సీపీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నర్సంపేట మండల కార్యదర్శి అయితా యాకయ్య, మియాపురం గోవర్ధన్‌, పాలక కవిత, బానోతు వీరునాయక్‌, పిట్టల సతీష్‌, గడ్డం యాకయ్య, గడ్డం నాగరాజు, శ్రీకళ, తదితరులు పాల్గొన్నారు.

ల్యాండ్‌ సర్వేయర్స్‌ నూతన కార్యవర్గం

గీసుకొండ: జిల్లా లైసెన్స్‌డ్‌ ల్యాండ్‌ సర్వేయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సోమవారం సంఘం కార్యాలయంలో జిల్లా సర్వేయర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం అసోసియేషన్‌ లీగల్‌ అడ్వైజర్‌ గోనె విజయ్‌రెడ్డి, బర్ల పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవునూరి రాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీగా గజవెల్లి ప్రదీప్‌, వరంగల్‌ డివిజన్‌ కోఆర్డినేటర్‌గా మామిడాల సాయిరామ్‌, సెక్రటరీలుగా బొమ్మెర రఘు, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్‌ కిరణ్‌, గౌరవ సలహాదారులుగా ఆవునూరి శివకుమార్‌, మహిళా కోఆర్డినేటర్‌గా బలుగురి దీపిక, నర్సంపేట డివిజన్‌ కో ఆర్డినేటర్‌గా పెంతల విష్ణుతో పాటు 13 మండలాల కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు రాజు తెలిపారు.

యూరియా కోసం బారులు
1
1/3

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు
2
2/3

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు
3
3/3

యూరియా కోసం బారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement