తగ్గిన దిగుబడి.. దక్కని మద్దతు ధర
ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్‌లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు.


