ఎరువుల కోసం తండ్లాట!
సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు.


