వరంగల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తల్లులకు తనివితీరా మొక్కులు
మేడారం సమ్మక్క, సారలమ్మలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్‌లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా రైతులు 2025లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.
దుగ్గొండి మండలం నాచినపల్లిలో మోంథా తుపాను
ప్రభావంతో మొలకలు వచ్చిన దూదిపింజలు (ఫైల్)
ఖానాపురం మండలం రంగాపురంలో నేలవాలిన వరి (ఫైల్)
తేదీ 29–12–2025, సోమవారం
సమయం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు..
ఫోన్ చేయాల్సిన నంబర్
9704458273
వరంగల్
వరంగల్


