వేతన వెతలు
దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి ప్రతిఒక్కరికీ ఆహార కొరత లేకుండా చూడాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో వలసలు తగ్గిపోవడంతో పాటు ప్రతీ కుటుంబం కొంత ఆర్థిక ప్రగతి సాధించింది. జిల్లాలోని 11 గ్రామీణ మండలాలు 325 గ్రామాల్లో 1.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2.37 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో 75 వేల జాబ్‌కార్డులకు చెందిన 1.26లక్షల మంది పనులు చేస్తున్నారు. వీరికి పని కల్పించడంతో పాటు పనులు చేయించడం, వేతన బిల్లులు అందించడానికి ఉపాధి సిబ్బంది పని చేస్తున్నారు.
రూ.1.22కోట్ల బకాయిలు..
జిల్లా వ్యాప్తంగా 172 మంది ఫీల్డు అసిస్టెంట్‌ట్లు, 11 మంది ఏపీఓలు, 10 మంది ఈసీలు, 36 మంది టెక్నికల్ అసిస్టెంట్‌లు, 23 మంది సీఓలు పనిచేస్తున్నారు. వీరందరికి గత మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ. 10వేల వేతనం కాగా రూ. 51.60 లక్షలు, ఏపీఓలకు రూ.13.20 లక్షలు, ఈసీలకు రూ. 15 లక్షలు, టీఏలకు రూ.25.92 లక్షలు, సీఓలకు రూ.16.56 లక్షలు ఇలా మొత్తంగా రూ.1.22 కోట్లకుపై వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. చాలీచాలని వేతనమైన వెట్టిచాకిరి చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్‌లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు అయినా వేతనాలు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు
పూట గడవక ఇబ్బందులు
జిల్లాలో రూ.1.22 కోట్ల బకాయిలు
భవిష్యత్‌పై ఆశతో పనిచేస్తున్నాం..
గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించాలి. ఇచ్చే వేతనం చాలా తక్కువ అయినా.. భవిష్యత్ బాగుంటుందనే ఆశతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యక్రమమైన తాము పాల్గొని ప్రజల్లోకి చేరవేస్తున్నాం. ప్రభుత్వం వచ్చే సంక్రాంతి పండుగ వరకై న వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. – కేలోతు స్వామిచౌహాన్,
ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రతీ నెలా వేతనాలు చెల్లించాలి..
ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, టీఏలు అందరూ వచ్చే వేతనంతోనే కుటుంబం గడుస్తుంది. అలాంటిది ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించకపోవడంతో ఇల్లు గడవటం, పిల్లల ఫీజలు చెల్లించలేని పరిస్థితి ఉంది. పలు కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలి. – ప్రసాద్,
టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
వేతన వెతలు
వేతన వెతలు
వేతన వెతలు
వేతన వెతలు


