మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 25వ మండల పూజ ముగింపు వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ఇరుకు కోటేశ్వర్‌రావు, సాగర్, బండారుపల్లి చెంచారావు, రాజేంద్ర, త్రివేణి, నాగేశ్వర్, కుసుమ కుమారి పాల్గొనగా బ్రహ్మశ్రీ శ్రీమాన్ కె.పద్మనాభనమోద్రి కేరళ వాస్తవ్యులు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధార స్వాములు, భక్తులు పాల్గొనగా పదునెట్టాంబడిపై మాలధార స్వాములు ఇరుముడితో దర్శనం చేసుకోగా దివ్య పడిపూజ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, దొడ్డ రవీందర్, అర్చకులు, స్వాములు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి సబ్ స్టేషన్‌లో 33/11కేవీలో విద్యుత్ మరమ్మతు కారణంగా నేడు (సోమవారం) ఉదయం 9 నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఈ శ్రీధర్, చెన్నారావుపేట ఏఈ సంపత్‌లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల ప్రజలు సహకరించాలని కోరారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఖానాపురం: మండలంలోని సైనిక్‌స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లోని జమాల్‌పూర్‌లో ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 ఖోఖో పోటీల్లో సైనిక్‌స్కూల్ విద్యార్థి చందు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపిౖకైనట్లు తెలిపా రు. అలాగే ఇటీవల ములుగులో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ కరాటే పోటీల్లో అండర్–19 విభా గంలో రామ్ చరణ్ ప్రథమ బహుమతి సాధించి జాతీయస్థాయిలకు ఎంపికయ్యారన్నారు. డై రెక్టర్ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు బట్టల షాపు దగ్ధం
నర్సంపేట రూరల్: ప్రమాదవశాత్తు అగ్ని ప్ర మాదం చోటు చేసుకుని బట్టల షాపు దగ్ధమైన సంఘటన చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఆదివారం చోటుచేసుకుంది. బూ ర్ణం స్వర్ణలత టైలర్‌షాపుతోపాటు బట్టల షాపు నడిపిస్తుంది. ఆదివారం ఉదయం షాపులో దే వుడి వద్ద దీపం వెలిగించి పని నిమిత్తం బయటకు వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రభు త్వం ఆదుకోవాలనిబాధితురాలు కోరుతుంది.
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ


