జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ‘పై చేయి’..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కు వినియోగించుకుని చైతన్యం కనబర్చారు. జిల్లా పరిధి ఐదు మండలా ల్లోని 73 జీపీలకు ఆరు ఏకగ్రీవం కాగా.. అందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే. ఆదివారం పోలింగ్ జరిగిన 67 గ్రామ పంచాయతీల్లో 33 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 22 పంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందగా, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నలుగురు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కలుపుకుని మొత్తం 10 మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా గెలుపొందారు.
మండలాల వారీగా ఫలితాలు ఇలా...
వేలేరులో బీఆర్‌ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 12 స్థానాలకు ఆరు చోట్ల బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలవగా, రెండు ఏకగ్రీవం కలుపుకుని 5 పంచాయతీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఒకచోట స్వతంత్రులు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. హసన్‌పర్తి మండలంలో 15 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి ఆరు కాంగ్రెస్, రెండు బీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా నాలుగింట్లో కాంగ్రెస్ రెబల్స్, రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఐనవోలు 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, ఐదు బీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. పరకాలలో పదింటికి ఆరు కాంగ్రెస్, నాలుగు బీఆర్‌ఎస్, ధర్మసాగర్‌లో 19 జీపీలకు రెండు ఏకగ్రీవం కలిపి 13 చోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. కాగా రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు అనూహ్య విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పలు గ్రామాల్లో ప్రభావం చూపింది.
హసన్‌పర్తిలో అధికార పార్టీని దెబ్బతీసిన రెబల్స్
జిల్లాలో రెండో స్థానంలో నిలిచిన ‘కారు’
సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అంతర్మథనంలో బీఆర్‌ఎస్, బీజేపీలు
మరిన్ని ఎన్నికల వార్తలు – 8లోu
రెండో విడత సర్పంచ్‌లు వీరే.. – 9లోu
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ‘పై చేయి’..


