ఇక్కడ బురద
అక్కడ వరద
నర్సంపేట పట్టణంలో ఒకటో వార్డులో మిషన్ భగీరథ పైపులకు పలు చోట్ల లీకేజీ ఏర్పడడంతో తాగునీరు వృథా అవుతోంది. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పలు చోట్ల మరమ్మతులు చేసి మరి కొన్నిచోట్ల వదిలేయడంతో అందరికి సరిపడా నీరు అందడం లేదు. వారం రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల తెలిపారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి లీకేజీలకు మరమ్మతులు చేయాలని ఆమె కోరారు.
– నర్సంపేట
వర్ధన్నపేట పట్టణ పరిధిలోని గుబ్బెటి తండా 5వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది. ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ లీకేజీలు ఏర్పడ్డాయి. దాంతో నీటి కొరతతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నీరు పారుతుండడంతో వాహనాదారులు, బాటసారులు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
– వర్ధన్నపేట
ఇక్కడ బురద


