ముగిసిన ప్రచారం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
‘ముఖ గుర్తింపు’తో సమయపాలన
శత్రువులు.. మిత్రులుగా కలిసిపోటీ చేసినా..
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో ఆసక్తికరమైన పోరు సాగింది. కొమ్మాల గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా కడారి మమత బరిలో నిలిచారు. ఆమెకు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు మద్దతు పలకడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈమెకు పోటీగా కొండా వర్గం వారు.. కన్నెబోయిన యమునను బరిలో నిలిపారు. ఈ క్రమంలో యమునకు 1,014 ఓట్లు రాగా, మమతకు 556 ఓట్లు వచ్చాయి. యమున 458 ఓట్ల మెజార్టీ సాధించింది. మండలంలో సర్పంచ్‌కు ఇదే అతిపెద్ద మెజార్టీగా అధికారులు చెబుతున్నారు.
ఎన్నో ఏళ్లకు దక్కిన అవకాశం
గీసుకొండ: మండలంలోని ప్రధాన పార్టీకి అతడే పెద్ద లీడర్. గతంలో రిజర్వేషన్ల కారణంగా ఆయనకు అవకాశం దక్కకపోవడంతో తన భార్యను పోటీలో నిలిపారు. ఆమె ఓ సారి జెడ్పీటీసీగా, పలుమార్లు ఎంపీపీగా పదవులను నిర్వర్తించారు. 30 ఏళ్లనుంచి పదవులకు పోటీ చేయడానికి వీరగోని రాజ్‌కుమార్‌కు రిజర్వేషన్లు అనుకూలించలేదు. దాంతో చాలాకాలంగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. తాజాగా గీసుకొండ సర్పంచ్ పదవి జనరల్‌కు కేటాయించడంతో ఆయన తప్పనిసరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోరులో తన ప్రత్యర్థిపై 406 ఓట్ల మెజార్టీతో రాజ్‌కుమార్ గెలుపొందారు.
డబ్బులు పంచిన వ్యక్తిపై కేసు
సంగెం: ఓటర్లకు డబ్బులు పంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కుంటపల్లిలో ఐదో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెంతల సంపత్ ఆదివారం తెల్లవారు జామున కానిస్టేబుళ్లు సాయికుమార్, శ్రవణ్‌కుమార్‌కు అనుమానాస్పదంగా కన్పించాడు. ఈ క్రమంలో ఆయనను విచారించగా తన వద్ద ఉన్న రూ.60 వేలను ఓటర్లకు పంచడానికి తిరుగుతున్నానని చెప్పి పోలీసులకు నగదు ఇచ్చి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో సంపత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
బస్సు డ్రైవర్‌పై దాడి కేసులో ఐదుగురిపై..
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. వేలేరు మండలానికి చెందిన డ్రైవర్ బొమ్మగాని వెంకటేశ్వర్లు.. ఆర్టీసీ హనుమకొండ డిపో నుంచి బస్సు తీసుకుని సంగెం మండలం షాపూర్‌కు వెళ్తున్న క్రమంలో గవిచర్ల గుండబ్రహ్మయ్య దేవాలయ సమీపంలో ఐదుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై అడ్డదిడ్డంగా వెళ్తూ బస్సుకు దారి ఇవ్వలేదు. ఈ క్రమంలో కండక్టర్ భూక్య శంకర్ వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన ఆ యువకులు.. బైక్‌లు ఆపి డ్రైవర్‌పై దాడిచేశారు. బస్సులోని ప్రయాణికులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటుండగా, సంగెం మండల కేంద్రానికి చెందిన మెట్టుపల్లి సూర్యుడు, మెట్టుపల్లి సిద్దు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 317గ్రామ పంచాయతీల మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న మొదటి దశ, 14న రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగా, 17వ తేదీన మూడో దశ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మూడో దశ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం పోలింగ్ ఉన్నందున ఓటర్లను తమవైపు మలుచుకునేందుకు తాయిలాలు అందిస్తున్నట్లు తెలిసింది. ఈ విడత పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో జరుగుతున్నందున అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు సవాల్‌గా తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ గుర్తు లేకుండా జరుగుతున్నందున కొంతమంది ఆయా పార్టీల్లో రెబల్స్‌గా పోటీ చేయడం నాయకులకు తలనొప్పిగా మారింది. ఇలా పోటీ చేసిన గ్రామాల్లో గెలిచే అభ్యర్థులు.. రెబల్స్ వల్ల ఓటమి పాలైన ఘటనలు మొదటి, రెండో దశ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. రెబల్స్‌ను ఉపసంహరణ చేయించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆయా పార్టీల ముఖ్య నాయకులు తలమునకలయ్యారు.
చెన్నారావుపేట మండలంలో..
మండలంలో 30 సర్పంచ్ స్థానాలకు ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 29 స్థానాలకు 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 258 వార్డు సభ్యుల స్థానాలకు 35 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగతా 223 స్థానాల కోసం 564 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఖానాపురం మండలంలో..
ఖానాపురం మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు ఒకరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 20 స్థానాలకు 62 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, 184 వార్డు సభ్యుల స్థానాల్లో 14 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 170 స్థానాలకు 396 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నర్సంపేట మండలంలో..
నర్సంపేట మండలంలో 19 సర్పంచ్ స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. 164 వార్డు సభ్యుల స్థానాలకు ఆరుగురు ఏకగ్రీవం కాగా, మిగిలిన 158 స్థానాలకు 379 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
నెక్కొండ మండలంలో..
నెక్కొండ మండలంలో 39 సర్పంచ్ స్థానాలకు ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 34 స్థానాలకు 96 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 340 వార్డు సభ్యుల స్థానాల్లో 82 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 258 స్థానాలకు 556 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
● కనీస వసతులు కల్పించాలని విన్నపాలు
● బల్దియా గ్రీవెన్స్‌కు 117 దరఖాస్తులు
● స్వీకరించిన కమిషనర్ చాహత్
నాలుగు మండలాల్లో రేపు పోలింగ్
మొత్తం 109 సర్పంచ్,
946 వార్డు స్థానాలు
ఏడుగురు సర్పంచ్‌లు.. 137వార్డులు ఏకగ్రీవం
102 సర్పంచ్ స్థానాలకు బరిలో
307 మంది అభ్యర్థులు
809 వార్డులకు 1,895మంది
మూడో దశ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్‌వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం


