వెబ్‌కాస్టింగ్‌లో పోలింగ్ సరళి పరిశీలన
న్యూశాయంపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపును కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించినట్లు తెలిపారు. నాలుగు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను(మైక్రో అబ్జర్వర్లు) నియమించి, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ సీఈఓ వసుమతి, డీపీఓ కల్పన, జిల్లా నోడల్ అధికారులు ఉన్నారు.


