
వర్షంలోనూ బారులు
ఖానాపురం: పంటల సాగు చివరి దశకు చేరినా.. రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ గొడుగులతో వచ్చి టోకెన్లు తీసుకున్నారు. ఖానాపురం పరిధిలో బుధరావుపేటకు 444, మంగళవారిపేటకు 222, మనుబోతులగడ్డకు 222, అశోక్‌నగర్‌కు 333, దబ్బీర్‌పేటకు 222 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్దకు వెళ్లి వర్షంలో బారులుదీరి టోకెన్లు తీసుకున్నారు.