
మా పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదు
న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కీ (బీఎస్‌ఏ) కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నర్సంపేటకు చెందిన ఓ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో విద్యార్థి సంఘాలతో కలిసి కలెక్టర్ సత్యశారదకు మొరపెట్టుకున్నారు. నెలరోజులుగా పాఠశాలకు వెళ్లకుండా నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డీఎస్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు. అయినా సమస్యలను ఇప్పుడే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కలెక్టర్ సమావేశ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు వారిని సముదాయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ సత్యశారద స్వీకరించారు.
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 80 ఫిర్యాదులు రాగా రెవెన్యూ 40, జీడబ్ల్యూఎంసీ 6, హౌసింగ్ 4, డీఆర్‌డీఓ 4, మిగతాశాఖలకు సంబంధించి 26 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అలాగే తమ కుమారుడు (ప్రభుత్వ ఉద్యోగి) తమ బాగోగులు చూడటం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. వర్ధన్నపేట సబ్ రిజిస్ట్రార్ ఏజెంట్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఈరెల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణం ఆపాలి
వరంగల్ మట్టెవాడలోని సర్వేనంబర్ 442లోని ప్రభుత్వ భూమిలో కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ సర్వే నంబర్‌లో జిల్లా కోర్టు ప్రభుత్వ భూమిగా గుర్తించినా.. నిర్మాణాలు జరుగుతున్నాయి.
– బి.రాజు కొత్తవాడ, వరంగల్
ప్రజావాణిలో బీఎస్‌ఏ బాధితుల మొర
వినతులు తక్షణమే పరిష్కరించాలి
కలెక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో 80 అర్జీలు

మా పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదు