
ఫౌండేషన్ తరగతులు షురూ
నర్సంపేట రూరల్: ఈ విద్యా సంవత్సరంలో నర్సంపేట వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఫౌండేషన్ కోర్సు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 50 సీట్లను కేటాయించగా రాష్ట్ర కోటాలో 42 సీట్లు, నేషనల్ కోటాలో 8 సీట్లతో మొత్తం 50 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర కోటలో మొత్తం 42 సీట్లకు 42 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. నేషనల్ కోటలో 8 సీట్లకు గాను 5 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. మరో మూడు సీట్లు రానున్న కౌన్సెలింగ్‌లో భర్తీ కానున్నాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదార రాజనర్సింహా, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నర్సంపేట పట్టణంలోని సర్వాపురం శివారులో దాత స్వర్గీయ దొడ్డ మోహన్‌రావు అందించిన భూమిలో నూతనంగా నిర్మించిన 250 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనంలో ప్రారంభించారు. సీ బ్లాక్‌లో తాత్కాలికంగా వైద్య కళాశాల భవనాన్ని కేటాయించి 2024–25 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు ఎంబీబీఎస్‌లో మొదటి సంవత్సరాన్ని సైతం పూర్తి చేసుకున్నారు. 2025–26 సంవత్సరంలో ఎంబీబీఎస్‌కు రెండో బ్యాచ్ అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, నేషనల్ కోటా కింద మొత్తం 50 సీట్లకు గాను 47 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. సోమవా రం నుంచి వారికి తొలుత పౌండేషన్ కోర్సును ఆన్‌లైన్‌లో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేషన ల్ కోటాలో కౌన్సెలింగ్‌లో మరో ముగ్గురు ఎంబీబీ ఎస్ విద్యార్థులు రావాల్సి ఉంది. ఈనెల 23 నుంచి కళాశాలలో నేరుగా తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మా ణం, వసతుల కోసం సుమారు రూ.180కోట్లు మంజూరు చేసిందని, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని, తక్షణమే ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టి వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ప్రారంభించిన నర్సంపేట వైద్య కళాశాల
ప్రిన్సిపాల్ మోహన్‌దాస్