
బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నర్సంపేట: బీసీ వ్యతిరేక అగ్ర కులాలకు చెందిన నాయకులు బీసీల హక్కులను కాలరాసే విధంగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే వచ్చేలా చేశారని బీసీ సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బీసీ సంఘాల జేఏసీ నాయకుడు డ్యాగల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘాల సభ్యులతో కలిసి సోమవారం అమరవీరుల జంక్షన్ వద్ద రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆరు శాతం కూడా లేని వారికి ఈడబ్ల్యూఎస్ ద్వారా 10శాతం రిజర్వేషన్లను దొడ్డి దారిలో కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల ఓట్లు అగ్రవర్ణ నా యకులకు వేయకుండా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. 42శాతం బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు ప్రతిఒక్కరూ బీసీ సంఘాల జేఏసీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు డ్యాగల శ్రీనివాస్‌ముదిరాజ్, కొల్లూరి లక్ష్మినారాయణ, చిలువేరు కొమ్మాలు, రుద్రారపు పైడి, మహాదేవుని జగదీష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్‌యాదవ్, నర్సంపేట పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, సురేందర్, రవీందర్, సురేందర్, శ్రీనివాస్, రమేష్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.