
మూక్స్ శిక్షణ ప్రారంభం
● నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువస్తున్న మూక్స్(మాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్)లను సద్వినియోగం చేసుకోవాలని నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. నిట్ వరంగల్‌లోని సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లో వారం రోజుల మూక్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్వీ.రమణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ప్రొఫెసర్ ఇందిరా కోనేరు యాలవర్తి, నిట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.