
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టరేట్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజవాణిలో జీడబ్ల్యూఎంసీ 16, పీడీ హౌసింగ్, ఆర్డీఓ హనుమకొండతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.