
మామూళ్ల మత్తులో ‘ఎకై ్సజ్’
● బెల్ట్ షాపు నుంచి నెలకు రూ.వెయ్యి, గుడుంబా సెంటర్ నుంచి రూ.2 వేల చొప్పున అక్రమంగా వసూలు
పర్వతగిరి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండలంలో ఎకై ్సజ్ అధికారుల దోపిడీ కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. మండలంలోని 33 గ్రామాల్లో సుమారు వంద బెల్ట్ షాపుల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున, 50 గుడుంబా సెంటర్ల నుంచి నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాగే, మండలంలోని ఏనుగల్, చింత నెక్కొండ, అన్నారం షరీఫ్, పర్వతగిరి గ్రామాల్లో ఆరు వైన్ షాపుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. ఎకై ్సజ్ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా..
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బెల్ట్ షాపులు, గుడుంబా సెంటర్లపై ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించకపోవడంతో పలు విమర్శలు తావిస్తోంది. 30 ఏళ్లుగా గుడుంబా సెంటర్ల నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పదేళ్లుగా గుడుంబా నిర్వాహకులపై కేసులు పెట్టడంలో ఎకై ్సజ్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
డ్రైవర్ ద్వారా వసూళ్లు
ఎకై ్కజ్ అధికారులు నెలవారీ మామూళ్ల వసూళ్లలో భాగంగా తమ డ్రైవర్ ద్వారా లంచాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వసూళ్లలో ఎకై ్సజ్ శాఖ డ్రైవర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

మామూళ్ల మత్తులో ‘ఎకై ్సజ్’