
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట: పేద విద్యార్థుల విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్‌ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. ప్రభుత్వ గురుకులాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో సర్కారు విఫలమైందని తెలిపారు.