
రూ.12.9 కోట్ల అమ్మకాలు
సాక్షి, వరంగల్: జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయి. దసరా, గాంధీ జయంతి గురువారం రావడంతో మద్యంప్రియులు ముందస్తుగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కేవలం గత సోమవారం, మంగళవారం రోజుల్లో బీర్లు, లిక్కర్ కలిపి రూ.12.9కోట్ల మద్యం విక్రయాలు జరిగిందని ఎౖక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. రేపు (గురువారం) వైన్‌షాపులు బంద్ కానుండడంతో బుధవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు రూ.కోట్లలో వ్యాపారం జరగనుందని అంచనా వేస్తున్నారు.
రూ.50.9కోట్ల అమ్మకాలు
గతేడాది దసరాకు రూ.42 కోట్ల విలువైన లిక్కర్, బీర్ల విక్రయాలు జరగగా ఈసారి ఏకంగా రూ.50.9 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. చాలామంది మద్యంప్రియులు పండుగ కోసం ముందే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మంగళవారం జిల్లాలోని పలు వైన్‌షాప్‌ల వద్ద సందడి కనిపించింది. బుధవారం కూడా ఈ తరహా వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది.
మూడే దరఖాస్తులు
జిల్లాలో వైన్ షాపుల దరఖాస్తుల సందడి పెద్దగా కనిపించడం లేదు. మద్యం దుకాణాల దరఖాస్తులకు నోటిఫికేషన్ వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటివరకు కేవలం మూడు దరఖాస్తులే గమనార్హం. ఓవైపు దసరా పండుగకి మందుబాబులు మందును ముందుగానే కొనేస్తుంటే.. వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఔత్సాహికులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అయితే అక్టోబర్ 18 వరకు సమయం ఉండడం, ఆలోపు స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడు దరఖాస్తులు పెరగొచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 63 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే పెద్దగా వ్యాపారం లేవని వరంగల్ రూరల్ జిల్లా నుంచి ఆరు వైన్ షాప్‌లు పొరుగున ఉన్న జిల్లాలకు తరలించారు. దీంతో ఆరు వైన్ షాప్‌లు తగ్గడంతో ఆ సంఖ్య 57కు చేరింది. మద్యం దుకాణాల టెండర్ల కోసం ఇప్పటివరకు ఐదు దరఖాస్తులు వచ్చాయి. అది కూడా నర్సంపేటలోని వైన్స్ కోసం ఈ దరఖాస్తులొచ్చాయి. అక్టోబర్ 18 వరకు సమయం ఉండడంతో ఆ లోపు దరఖాస్తులు పెరిగే అవకాశముంది. రూ.మూడు లక్షల డీడీ, లేదా చెక్కు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు రిజర్వేషన్ల ప్రకారం కులధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్‌లను జతపరిచి దరఖాస్తులు అందజేయాలని వరంగల్ రూరల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.అరుణ్ కుమార్ తెలిపారు.
రెండు రోజుల్లోనే పెరిగిన
మద్యం అమ్మకాలు
దసరా, గాంధీ జయంతి ఒకేరోజు
కావడంతో ముందస్తుగా కొనుగోలు చేస్తున్న మద్యంప్రియులు

రూ.12.9 కోట్ల అమ్మకాలు