
కాత్యాయని అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో నవశక్త్యార్చన, దుర్గా సూక్త పారాయణం, శ్రీ లలిత ఖడ్గమాల అష్టోత్తర శతనామార్చన, త్రిశతి, శ్రీచక్రార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్‌శర్మ, దేవేందర్, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.