
సాయుధ పోరాటం మరుపురాని ఘట్టం
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి
పెద్దారపు రమేశ్
దుగ్గొండి: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరుపురాని ఘట్టమని ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ పంక్షన్ హాల్‌లో పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సా యుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొదట తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివా ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరులు అమరులయ్యారన్నారు. సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలననుండి విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు, వంగాల రాగసుధ, కన్నం వెంకన్న, సింగతి మల్లి కార్జున్, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, డివిజన్ కమిటీ సభ్యులు గటి కె జమున, తడుక కౌసల్య, గీసపాక కొంరయ్య, బుడిమె సురేందర్, బత్తిని కుమారస్వామి, అనుముల రమేష్, సీతారాములు పాల్గొన్నారు.