బాల్యవివాహాల నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి

Sep 11 2025 10:16 AM | Updated on Sep 11 2025 10:16 AM

బాల్య

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి

ఖానాపురం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఉమ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం బాలల సంరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మికుల అక్రమ దత్తత, బిక్షాటన నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడంలో కమిటీలు ముందుండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్‌కుమార్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌ సుజాత, ఏపీఓ సునీత, ఎంఈఓ శ్రీదేవి, హౌసింగ్‌ ఏఈ నవీన, డాక్టర్‌ సునీత, ఏపీఎం ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరిపై కేసు నమోదు

నర్సంపేట రూరల్‌ : ఒకరు మృతిచెందిన కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట రూరల్‌ ఎస్సై అరుణ్‌ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లికి చెందిన కత్తి సారంగం దంపతులు ఈనెల 4న గొడవపడుతుండగా.. సారంగం తల్లి కత్తి సూరమ్మ (65) అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ, పక్కనే ఉన్న సారంగం బామ్మర్ధి బర్ల అశోక్‌ తన అక్క శ్రీమేథను తిడుతున్నారని సూరమ్మ ఛాతి, క డుపులో కొట్టడంతో పడిపోగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన సూరమ్మ బుధవారం ఉదయం ముఖం కడ్డుకొ ని లేచి నిలబడి కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అ ప్పటికే సూరమ్మ మృతిచెందినట్లు నిర్ధారించా రు. దీంతో శ్రీమేథ, అశోక్‌ ఇద్దరు కొట్టిన దెబ్బ లతోనే తనతల్లి చనిపోయిందని సూరమ్మ కూ తురు రమ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇంటర్‌లో అడ్మిషన్లకు మరో అవకాశం

విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ఇంటర్‌ అడ్మిషన్లకు రెండు రోజులుపాటు(11, 12 తేదీల్లో) అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్‌ మీటింగ్‌లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన తెలిపా రు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురుల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి

ఖానాపురం: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని గర్ల్‌ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డ్డినేటర్‌(జీఈసీఓ) ఫ్లోరెన్స్‌ అన్నారు. మండలంలోని అశోక్‌నగర్‌లో కేజీబీ వీని బుధవారం డిస్ట్రిక్ట్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీటీడీఓ) సౌజన్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికా ర్డులు, స్టోర్‌రూం, విద్యార్థులకు అందజేసే మెనూ, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధ న అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థినులపై నిర్లక్ష్యం చేస్తే ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. మె నూ ప్రకారం భోజనం పెట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓ మేనక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని, సంఘాల్లో రుణా లు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్‌ డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు. డీపీఎం దాసు, సుధాకర్‌, రాజు, సారయ్య, మమత, స్వప్న, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి 
1
1/1

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement