అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా

Jun 17 2025 4:49 AM | Updated on Jun 17 2025 4:49 AM

అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా

అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా

కాజీపేట అర్బన్‌: అనుమతి లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. హంటర్‌ రోడ్డులోని విశాల్‌మార్ట్‌ ఎదురుగా ఉన్న నారాయణ హైస్కూల్‌ను కాజీపేట మండల విద్యాశాఖ అధికారి బండారి మనోజ్‌కుమార్‌ సోమవారం సీజ్‌ చేశారు. ఎంఈఓ మనోజ్‌కుమార్‌ తెలిపి న వివరాల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడిపిస్తున్న నారాయణ హైస్కూల్‌ను మూసేసి యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామన్నారు.

గుర్తింపు లేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌

విద్యారణ్యపురి: హనుమకొండ రాంగనర్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న మెరీడియన్‌ హై స్కూల్‌ను సోమవారం సీజ్‌ చేసినట్లు హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి గుగులోతు నెహ్రూ తెలిపారు. ఆహైస్కూల్‌ను ఇటీవల ఓసారి సీజ్‌ చేసినప్పటికీ మళ్లీ సీజ్‌ను తొలగించుకుని కొనసాగిస్తుండడంతో కాజిపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్‌తో కలిసి వెళ్లి మరోసారి సీజ్‌ చేసినట్లు నెహ్రూ తెలిపారు. నగరంలోని డబ్బాల జంక్షన్‌ సమీపంలోని ఏకశిల హై స్కూల్‌లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఓగదిలో పుస్తకాల్ని స్టోర్‌గా కూడా ఉపయోగించుకుంటున్నట్లు గుర్తించామని, ఆ పుస్తకాలు ఉన్న గదిని సీజ్‌ చేసినట్లు ఎంఈఓ నెహ్రూ తెలిపారు.

నగరంలోని పలు స్కూళ్లు సీజ్‌

విద్యాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement