కాల్వలో నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టులో నీరు లేదని సరఫరా నిలిపివేశారు. దీంతో పంటకు నీరందక వాడుముఖం పట్టింది. రైతులంతా ప్రాజెక్టు వద్దకు వెళ్లి సాగునీరు ఇవ్వమని కోరాం. దీనికే కేసు నమోదు చేయడం శోచనీయం.
– దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్)
గ్రామంలో అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఒకానొక సందర్భంలో వ్యతిరేకించాం. దీనిని దృష్టిలో ఉంచుకొని సాగునీటి కోసం వెళ్లిన తనపై కేసు నమోదు చేయడం దారుణం. రైతురాజ్యం అంటూనే రైతులపై కేసులు ఎలా పెడతారో అర్థం కావడం లేదు.
– షరీఫ్, రైతు, మూలమళ్ల


